: రాష్ట్రపతితో సీఎం భేటీ.. ఊపందుకున్న ఊహాగానాలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను రాష్ట్రపతికి వివరిస్తున్నారు. జాతీయ మీడియాలో హైదరాబాదును యూటీగా చేసే అంశం, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన వంటి ఊహాగానాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని మాత్రమే కలిసి తిరుగు ప్రయాణమయ్యే కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రపతిని కలవడం వెనుక ఉద్దేశం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.