: సీమాంధ్రకు చెందిన పార్టీలన్నీ సమైక్యవాదమే వినిపిస్తున్నాయి: లగడపాటి
సీమాంధ్రకు చెందిన పార్టీలన్నీ సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభిమతాన్ని గౌరవించాలని ఆంటోనీ కమిటీని కోరినట్టు ఆయన తెలిపారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు తండోపతండాలుగా కదిలివస్తున్నారని, సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని అన్నారు. గత 34 రోజులుగా ప్రతి ఆంధ్రుడు విభజనను వ్యతిరేకిస్తున్నారని లగడపాటి అన్నారు. తమను విభజించొద్దని కోరుతున్నారని వివరించారు. విభజనవాదుల వేర్పాటు భావాలు విని విని అవి నిజమనుకున్న రాజకీయ పార్టీలు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరామని ఆయన తెలిపారు.