: ఆశారాంకు చుక్కెదురు
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. జోధ్ పూర్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ రోజు పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఆశారాం జైల్లో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వడంవల్ల దర్యాప్తుకు భంగం కలిగే ప్రమాదం ఉందని పేర్కొంది. జైల్లో ఉన్న ఆయన ఓ పోలీసును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని న్యాయస్థానంలో వాదనల సందర్భంగా ఆశారంపై విచారణ చేస్తున్న అధికారులు తెలిపారు. అలాంటప్పుడు ఆశారాంకు బెయిల్ ఇస్తే దర్యాప్తును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించారు. దాంతో, కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. 16 సంవత్సరాల బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారన్న కేసులో ఆశారాంకు కోర్టు 12 రోజుల పోలీసు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.