: సభకు అనుమతి చట్టవిరుద్ధం: కేకే
ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడంపై టీఆర్ఎస్ నేత కేకే మండిపడ్డారు. సభకు ఎలా అనుమతిస్తారంటూ సర్కారును ప్రశ్నించారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 7న నిర్వహించబోయే సభకు అనుమతి చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఆ సభలో వెల్లడయ్యే భావాలు ఎవరికైనా ఇబ్బందికరంగా పరిణమిస్తే, అప్పుడా భావాలు చట్ట విరుద్ధమవుతాయని వివరణ ఇచ్చారు. ఆ సభ రాబోయే రోజుల్లో ద్వేషభావాలు రేకెత్తిస్తే అందుకు ప్రభుత్వాలదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. మొన్నటివరకు అనుమతి లేదన్న అనురాగ్ శర్మ ఇప్పుడెలా అనుమతిస్తారని కేకే ప్రశ్నించారు. శర్మ మనసు మారిపోవడానికి కారణమేంటని ఆయన మండిపడ్డారు.