: మాకు లేనిది.. వారినెలా అనుమతిస్తారు?: కోదండరాం
శాంతి ర్యాలీలు, సద్భావనా సదస్సులు నిర్వహిస్తామంటే తమకు అనుమతినివ్వని ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభలు సమావేశాలకు ఎలా అనుమతిస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం ప్రశ్నించారు. హైదరాబాద్ లో జానారెడ్డిన కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ర్యాలీలపై ముఖ్యమంత్రి తీరును ఖండిస్తున్నామని అన్నారు. కేవలం ముఖ్యమంత్రి వైఖరి వల్లే హైదరాబాద్ లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపించారు. తక్షణం కేంద్రం జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కోరారు. తెలంగాణ జేఏసీకి లేని అనుమతి ఎపీఎన్జీవోలకు ఎలా దొరికిందని మండిపడ్డారు. దీనిపై రాజకీయ నాయకులే స్పందిస్తారని ఆయన స్పష్టం చేశారు.