: ఆర్బీఐ సారథిగా రఘురాం సమర్థుడే : దువ్వూరి
భారత ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వు బ్యాంక్ గవర్నర్ గా రఘురాం రాజన్ కంటే సమర్ధుడు లేడని ఆర్బీఐ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఆర్బీఐకి సమర్థుడైన సారథి లభించారని ఆయన రఘురాం రాజన్ ను అభినందించారు. ఐదేళ్ళు రిజర్వుబ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించిన దువ్వూరి నేడు కొత్త గవర్నర్ రఘురాం రాజన్ కు బాధ్యతలు అప్పగించారు.