: ఇక ఎంఆర్పీ ధరలకే మందులు


మెడికల్ షాపుల్లో ఇప్పటివరకూ డిస్కౌంట్ విధానంలో మందులు అమ్ముతూ వస్తున్న సంగతి తెలిసిందే. మందుల ధరలతో పాటు విక్రయదారులకిచ్చే మార్జిన్ ను కూడా తగ్గిస్తూ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ (డీపీసీ) కొత్త విధానం ప్రవేశపెట్టడంతో దుకాణదారులు డిస్కౌంట్ విధానానికి స్వస్తి పలికాలని నిర్ణయించారు. అయితే, ఈ నూతన విధానంతో వినియోగదారుడు లబ్ది పొందనున్నాడు. ఎలాగంటే, ఆగ్ మెల్పిన్ అనే యాంటీ బయోటెక్ ట్యాబ్లెట్ల స్ట్రిప్ ఇంతకుముందు రూ.266లకు లభ్యమయ్యేది. తాజా విధానం ప్రకారం ఇప్పుడది రూ.141కే దొరుకుతుంది. అంటే, వినియోగదారుడికి 125 రూపాయలు ఆదా అన్నమాట.

ఇప్పటివరకు దుకాణదారుకు 16 నుంచి 22 శాతం వరకు మార్జిన్ లభిస్తుండగా.. ఇప్పుడు దాన్ని 13 శాతానికి తగ్గించారు. ఇలా మార్జిన్ తగ్గిస్తే తమకు నష్టాలు తప్పవంటున్న విక్రయదారులు కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ కు చరమగీతం పాడారు. ఇంతక్రితం తమకు 22 శాతం మార్జిన్ వస్తే దాంట్లో పదిశాతం వినియోగదారుడికి డిస్కౌంట్ గా ఇచ్చేవారమని.. డీపీసీ నిర్ణయంతో డిస్కౌంట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. కాగా, డీపీసీ తాజా నిబంధనల ప్రకారం మొత్తం 370 రకాల ఔషధాల ధరలు తగ్గాయి. మెడికల్ షాపు యజమానుల సంగతెలా ఉన్నా వినియోగదారులకు మాత్రం డీపీసీ నిర్ణయం కచ్చితంగా సంతోషం కలిగించేదే.

  • Loading...

More Telugu News