: హిజ్బుల్ ముజాహిదీన్ అగ్రనేత అరెస్టు
నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన అగ్రనేతల్లో ఒకరైన తలిబ్ లలిని కాశ్మీర్ లోని బండిపురా జిల్లాలో భద్రతాదళాలు అరెస్టు చేశాయి. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అజాస్ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ తెల్లవారుజామున భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ఇరువైపుల కాల్పులు చోటు చేసుకున్నాయని, ఎవరూ గాయపడలేదని వివరించారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామన్నారు.