: నూతన వధువుపై నెలల తరబడి అత్యాచారం


ప్రపంచంలో ఇంతకంటే మూఢులుంటారా..? అనిపించకమానదు ఈ ఘటన వింటే. కొత్తగా పెళ్ళయిన ఓ అమ్మాయిని ఆమె భర్త, అత్తలే నాలుగు నెలలుగా ఓ నకిలీ బాబా వద్దకు పంపుతున్నారు. అతగాడు ఆమెపై యధేచ్చగా అత్యాచారం చేస్తున్నాడు. పాపం పండడంతో ఇటీవలే అరెస్టయ్యాడు. వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్ లోని నీల్ ఖండ్ గ్రామంలో టున్నుబాబా (65) ఓ స్వామీజీగా చలామణీ అవుతున్నాడు. ఏం మాయచేశాడో కానీ, ఇతగాడికి ఓ కుటుంబం దాసోహమైంది. ఆ కుటుంబంలోని విశ్రామ్ బంజారా అనే వ్యక్తికి నాలుగు నెలల క్రితం పెళ్ళయింది. ఏవో పూజలు చేయాలని చెప్పిన టున్ను బాబా ఆ యువతి (24)ని తన వద్దకు పంపాలని ఆ కుటుంబాన్ని ఆదేశించాడు. దీంతో, ఆమె భర్త, అత్త మరో మాట మాట్లాడకుండా కీచకబాబా చెప్పినట్టే నడుచుకున్నారు.

పెళ్ళయిన కొద్దిరోజులు కూడా గడవకముందే టున్ను బాబా ఆమెను తన లైంగిక వాంఛలకు బలిచేయసాగాడు. ఓ యువతిని ఆశ్రమంలో బంధించి అత్యాచారం చేస్తున్నాడని ఎవరో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News