: 'ఎంపీ ఉద్యోగం' చేస్తానంటున్న దర్శకుడు


సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీకాదు. వారికున్న ఇమేజ్ తో ప్రజలను ఆకర్షించి చట్టసభల్లో కూర్చున్న వారు ఎంతోమంది. ఇదే వరసలో బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవ్వాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. 'గంగాజల్', 'అపహరణ్', 'రాజ్ నీతి', 'అరక్షణ్', 'చక్రవ్యూహ్' వంటి పలు చిత్రాలను రూపొందించిన ఝా.. సమాజంలోని ఒక్కో అంశాన్ని కథలుగా మార్చి చిత్రంగా తెరకెక్కించి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, ఝా గతంలో 2004, 09లో ఎన్నికల్లో ఎంపీగా తన స్వస్థలం బీహార్ లోని దక్షిణ చంపారన్ నుంచి పోటీచేసి ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్ మాట్లాడుతూ.. 'రాజీకీయాల్లోకి రావాలని నాకు లేదు. కానీ, ఎంపీగా చేయాలని ఉంది. ఎన్నికల్లో పోటీచేసి సభలో ఓ స్థానం దక్కించుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News