: మెస్ ల ప్రైవేటీకరణపై మండిపడ్డ విద్యార్థులు
మెస్ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీసీ చాంబర్ ను ముట్టడించారు. మెస్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీసీ ఛాంబర్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థులు పరిపాలన భవనం ఎక్కారు. ఫీజుల పేరిట డబ్బులు గుంజుతున్న అధికారులు తుగ్లక్ విధానాలను అవలంభిస్తున్నారని.. విద్య, వసతి అందించే యూనివర్శిటీ అధికారులు మెస్ దగ్గర మాత్రం అధికవసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు ప్రైవేటీకరణ అంటున్నారని విద్యార్థులు మండిపడ్డారు. తక్షణం వీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.