: చంచల్ గూడ జైలే జగన్ కార్యాలయం: గాలి
చంచల్ గూడ జైలే వైఎస్సార్సీపీ అధినేత జగన్ కార్యాలయమని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వమే జగన్ కు ములాఖత్ లు కల్పిస్తోందని మండిపడ్డారు. సెల్ ఫోన్లు కూడా ప్రభుత్వమే సమకూరుస్తోందని అన్నారు. జైలు నిబంధనలకు విరుద్ధంగా జగన్ మెడలో బంగారు గొలుసు వేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రజాధనం కొల్లగొట్టిన దోపిడీదారును చూడాల్సిన విధానం అది కాదన్నారు.