: రాకెట్ తో చేపల వేట.. గురితప్పడంతో ఆరుగురు మృతి


ఆఫ్ఘనిస్థాన్ పోలీసుల చేపల వేట ఆరుగురు చిన్నారుల ప్రాణాలను బలిదీసుకుంది. దోషి జిల్లాలో ఒక నదిలో పోలీసులు రాకెట్ గ్రెనేడ్లతో చేపలను వేటాడుతున్నారు. నదికి అటువైపు తీరంలో చిన్నారులు ఈత కొడుతున్నారు. చేపల కోసం పోలీసులు విడిచిన రాకెట్ గ్రెనేడ్ గురితప్పి చిన్నారులపైకి దూసుకుపోవడంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వీరంతా 10 నుంచి 14 ఏళ్ల వయసులోపు వారు. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఎనిమిదిమంది పోలీసులను అరెస్ట్ చేసి విచారణ కోసం సైనికాధికారులకు అప్పగించారు. గ్రెనేడ్లతో చేపలను వేటాడడం ఆఫ్ఘనిస్థాన్ లోని పలు ప్రాంతాలలో సర్వసాధారణం.

  • Loading...

More Telugu News