: హైదరాబాదును యూటీ చేస్తే ఊరుకోము: హరీష్ రావు
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, తమకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న మనస్తత్వంతో సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు.