: యూటీ ప్రతిపాదనలు లేవు: చిరంజీవి
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదనలు ఏమీలేవని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. తమదీ (కేంద్ర మంత్రులు) సమైక్యవాదమేనని చెప్పారు. ఇకనుంచి ప్రజల ఆకాంక్ష, నిర్దేశం మేరకే నడుచుకుంటామని తెలిపారు. సీమాంధ్ర ప్రజలంతా సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారన్న చిరు, ఒకప్పుడు రాజకీయ నేతలు ప్రజలకు మార్గనిర్దేశం చేసేవారని.. ఇప్పుడు ప్రజలే నేతలను నడిపిస్తున్నారని పేర్కొన్నారు.