: ముంబై గ్యాంగ్ రేపిస్టులు చాలమందితో ఆడుకున్నారు
ముంబైలో గత నెల ఓ ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు కరడుగట్టిన రేపిస్టులని పోలీసులు చెబుతున్నారు. శక్తి మిల్స్ ప్రాంతంలో వారు చాలా అకృత్యాలకు పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. వీరు కనీసం 10 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరి బారిన పడిన వారిలో ఓ మహిళ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కానీ, పలువురు బాధితులు భయపడి బయటకు రావడంలేదు. శక్తిమిల్స్ ప్రాంతంలోని స్లమ్స్ లో ఉంటూ ఉద్యోగం చేసుకునే మహిళలు రాత్రి తొందరగా ఇళ్లు చేరుకోవాలని శక్తి మిల్స్ దగ్గర్లో ఉన్న రైలు పట్టాలను దాటుకుని ఇళ్లకు చేరుతుంటారు. అలా ఒంటరిగా పట్టాలు దాటే మహిళలే వారి టార్గెట్ అని, వారిని శక్తి మిల్స్ లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేసే వారని తెలిపారు.
అలాగే ఏకాంతం కోరుకుని శక్తి మిల్స్ లోపలికి వచ్చే ప్రేమజంటలపైనా వీరు దాడి చేసి, అమ్మాయిలపై అత్యాచారం చేసేవారని తెలిపారు. అలాగే ఓ వేశ్యను తీసుకొచ్చి ఆమెను అనుభవించి డబ్బులివ్వకుండా వదిలేసి వెళ్లిపోయారని కూడా తెలిపారు. వారి నేరాల చిట్టా చాలా ఉందని నెమ్మదిగా నోరువిప్పుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కిరాతకుల బారినపడిన బాధితులు మాత్రం నోరు మెదపడం లేదని.. వీరంటే ఉన్న భయంతోనే బాధితులు వెనుకంజ వేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.