: హైదరాబాద్ వినాయక ఉత్సవ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై మంత్రులు గీతారెడ్డి, మహీధర్ రెడ్డి, డీకే అరుణ, దానం నాగేందర్ లు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఉత్సవాల సమయంలో నగరంలో భద్రత, వినాయక నిమజ్జన విషయాలపై ప్రధానంగా చర్చించారు. ప్రతి ఏటా హైదరాబాదు మహానగరంలో కొన్నివేల వినాయక విగ్రహాలు నిమజ్జనమవుతాయి. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోవడంతో భారీస్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.