: యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన పేస్


భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ యూఎస్ ఓపెన్ లో సెమీఫైనల్ చేరాడు. డబుల్స్ విభాగంలో పేస్, స్టెపానెక్ జోడీ క్వార్టర్ ఫైనల్లో 6-1, 6-7 (3), 6-4తో ఐజామ్ ఖురేషి, జీన్ రోజర్స్ ద్వయాన్ని చిత్తు చేసింది. ఇక టోర్నీలో మహిళల, పురుషుల సింగిల్స్ లో టాప్ సీడ్లు ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ లో అమెరికా క్రీడాకారిణి సెరెనా విలియమ్స్.. కార్ల్ స్క్వారిజ్ నవరోపై 6-0,6-0తో చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్ లో చైనా క్రీడాకారిణి నా లీ గెలుపొందింది. పురుషుల సింగిల్స్ లో జకోవిచ్ 6-3,6-0,6-0 తేడాతో మార్సెల్ గ్రానోలర్స్ పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ జోడి సెమీస్ కు చేరింది.

  • Loading...

More Telugu News