: ఆ రికార్డు గురించిన ఆలోచన లేదు: సచిన్
200వ టెస్ట్ మ్యాచ్ మైలురాయి గురించి తాను ఆలోచించడం లేదని విఖ్యాత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ స్పష్టం చేశాడు. 200వ టెస్ట్ మ్యాచ్ అనంతరం సచిన్ టెస్టులకూ రిటైర్ మెంట్ ప్రకటిస్తాడంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించాడు. 23 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా తానెప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదని అన్నాడు. మైలు రాయిని అధిగమించినప్పుడే దానిపై మాట్లాడదామని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సచిన్ 200వ టెస్ట్ మ్యాచును దక్షిణాఫ్రికాలో ఆడతాడని భావించగా.. బీసీసీఐ అంతకంటే ముందే వెస్టిండీస్ తో రెండు నెలల టెస్ట్ సిరీస్ ను భారత్ లో నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. దీంతో సొంతగడ్డపైనే సచిన్ అభిమానులకు 200వ టెస్ట్ మ్యాచుతో అలరించనున్నాడు. సచిన్ ఇప్పటికే టి20, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.