: హైదరాబాదు కుషాయిగూడలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ కుషాయిగూడలోని కందిగూడ చౌరస్తా వద్ద శ్రీకాంత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతని గొంతుకోసి చంపినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పాతకక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.