: అమెరికాలో సిక్కులపై కాల్పులు
అమెరికాలో జాతి విద్వేషాలు మరోసారి పెచ్చరిల్లాయి! గతంలో సిక్కు ప్రార్థనా మందిరాలపై దాడుల ఘటన మరువక ముందే మరోసారి సిక్కులపై కాల్పులకు తెగబడ్డారు. కన్వల్జిత్ సింగ్ (46) అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి డేటోనా బీచ్ ప్రాంతంలో ఉండగా దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కన్వల్జిత్ కు తీవ్ర బుల్లెట్ గాయాలు కాగా, అతని కుమారుడు తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
కన్వల్జిత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నపోలీసు అధికారి కాల్పుల వెనుక ఉన్న ఉద్ధేశం తెలియడంలేదని వ్యాఖ్యానించాడు. అయితే, కన్వల్జిత్ కు.. కాల్పులు జరిపిన వ్యక్తులతో ఎలాంటి గొడవలు లేకపోయినా, దాడికి యత్నించడం వెనుక జాతి విద్వేషం దాగి ఉందని అనుమానిస్తున్నారు.