: దీంతో గుండెపోటును ముందే పసిగట్టవచ్చు!
గుండెపోటు ఎప్పుడు వస్తుంది? అనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించలేము. ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న తర్వాత వారికి మలిపోటు అనేది కచ్చితంగా వస్తుంది. ఈ మలిపోటులో చాలామంది మరణిస్తుంటారు. అయితే ఈ మలిపోటు ఎప్పుడు వస్తుంది? అనేది కచ్చితంగా తెలిస్తే దానికి తగు నివారణ చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఒక సరికొత్త యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ రెండవ సారి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగడుగుతుందని చెబుతున్నారు.
ఎడిన్‌బర్గ్, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఒక వినూత్న స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ (యాప్)ను ఆవిష్కరించారు. ఈ యాప్ గుండెపోటు ప్రమాదాన్ని మూడేళ్లకు ముందే పసిగడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి గుండెపోటు వచ్చిన వారికి ఐదేళ్లలో మళ్లీ రెండవసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ తాజా యాప్ రెండవసారి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని మూడేళ్లకు ముందే పసిగడుతుందట. రోగి గుండెకొట్టుకునే రేటు, రక్తపోటు, కిడ్నీ పనితీరు, తొలిసారి గుండెపోటు తీవ్రత వంటి వివిధ విషయాలను అంచనావేసి వచ్చే మూడేళ్ల పరిస్థితిని కూడా అంచనావేసి చెబుతుందట. రెండవసారి వచ్చే గుండెపోటును నివారించేందుకు ఏ చికిత్స అందించాలి? అనే విషయాన్ని కూడా ఈ యాప్ సూచిస్తుందని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య కీత్ ఫాక్స్ చెబుతున్నారు.