: సిక్కు అల్లర్ల కేసులో సీబీఐ తుది వాదనలు
1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ పాత్రపై ఢిల్లీ కోర్టులో ఈ రోజు తుది వాదనలు జరగనున్నాయి. సీబీఐ తన వాదనలను కోర్టుకు వినిపించనుంది. ఈ రోజు, రేపటిలో ఈ కేసులో వాదనలు ముగుస్తాయి. అనంతరం కోర్టు తీర్పును ప్రకటిస్తుంది.
గత విచారణ సందర్భంగా సీబీఐ పనితీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలో వాదనలు ముగించకుంటే తామే బలవంతంగా ముగించేసి తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో సీబీఐ ఈ రోజు, రేపటిలో ఈ కేసుపై తన వాదనలను పూర్తి చేయనుంది.

వాస్తవానికి 1984 నాటి సిక్కు అల్లర్లపై నమోదైన కేసులన్నింటి విచారణను ఆరు నెలల్లోగా ముగించేయాలని 2010లోనే ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇంత సుదీర్ఘ కాలం విచారణ కొనసాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సిక్కులపై అల్లరి మూకలను ఉసిగొల్పి ఆరుగురి హత్యలకు కారణమయ్యారనే అభియోగాలపై సజ్జన్ కుమార్ తోపాటు మరో ఐదుగురు విచారణ ఎదుర్కొంటున్నారు.