: బాబూ.. ఇంత దిగజారుడు రాజకీయాలా?: హరీశ్ రావు
గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బాబు పూటకోమాట చెబుతూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేస్తోంది చంద్రబాబే అని ఆరోపించారు. తెలంగాణపై వైఖరేమితో స్పష్టం చేయకుండా ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఎక్కువసార్లు మాటమార్చిన చరిత్ర బాబుదేనని ఎద్దేవా చేశారు. ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే క్రమంలో ఇరుప్రాంతాల ప్రజలను కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత బాబుకు లేదా? అని హరీశ్ ప్రశ్నించారు. ఇక, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండొచ్చని తెలిపారు. సీమాంధ్రులను ఎవరూ వెళ్ళగొట్టరని స్పష్టం చేశారు.