: ఏపీఎన్జీవోల సభకు అనుమతి లేనట్లేనా..?
హైదరాబాదులో ర్యాలీలు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలపై ఉన్న నిషేధం ఈ నెల 10 వరకు పొడిగించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ నెల 10 వరకు పొడిగిస్తూ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏపీఎన్జీవోల సభకు అనుమతి లేనట్టేనని తెలుస్తోంది. అయితే, స్టేడియంలో అనుమతి నిరాకరిస్తే రోడ్ల మీదే సభ జరుపుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.