: విశాలాంధ్ర మహాసభ ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరణ
ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు అనుమతి అడిగిన విశాలాంధ్ర మహాసభ నాయకులకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సిబ్బంది ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరించడంతో పాటు 2 గేట్లకు తాళం వేశారు. దీంతో, విశాలాంధ్ర నేతలు అక్కడే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.