: భద్రతలేని నగరాల్లో ఢిల్లీకి ప్రథమస్థానం


ఇటీవల చోటు చేసుకున్న'నిర్భయ' అత్యాచారం కేసుతో దేశ రాజధాని ఢిల్లీలోని వాస్తవిక పరిస్థితులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అత్యంత భద్రత లేని మెట్రో నగరాల్లో ఢిల్లీయే టాప్ అని ఓ సర్వే వెల్లడించడం అక్కడి అరాచక స్థితిని తేటతెల్లం చేస్తోంది.

ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధికులు ఢిల్లీలో మనుగడ అత్యంత కష్టసాధ్యమని, రక్షణ ఉండదని అభిప్రాయపడ్డారట. ముఖ్యంగా మహిళలకు ఏ రూపేణా గానీ ఇది అనుకూలమైన నగరం కాదని సర్వే చెబుతోంది. ఇక ముంబయి విషయానికొస్తే అత్యంత సురక్షిత నగరంగా మెజారిటీ ప్రజలు ఓటేశారు. ఈ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు నిలిచాయి.

  • Loading...

More Telugu News