: పుకుషిమా అణు విద్యుత్కేంద్రానికి భారీగా నిధులు


జపాన్ లోని పుకుషిమా అణువిద్యుత్కేంద్రానికి ఆ దేశ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. పుకుషిమా అణువిద్యుత్కేంద్రంలో రేడియో యాక్టివిటీతో కలుషితమైన నీటి లీకేజీని అరికట్టడానికి జపాను ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. ఇందుకుగాను దాదాపు 470 మిలియన్ డాలర్ల సొమ్మును వినియోగించనున్నట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. 2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీల ధాటికి పుకుషిమా అణువిద్యుత్కేంద్రం దెబ్బతింది. అప్పటి నుంచి మరమ్మతులు కొనసాగుతున్నాయి. గతవారం పరిస్థితి సంక్షోభ స్థాయికి వచ్చినట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తమై అత్యవసర ప్రమాద నివారణ చర్యలు, మరమ్మతులు చేపట్టారు.

  • Loading...

More Telugu News