: 'శ్రీశైలం ప్రాజెక్టుపై కన్నేస్తే ఊరుకోం'
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యమవేడి అంతకంతకూ పెరిగిపోతుండగా, నేతల మాటలు పదునెక్కుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు సురేశ్ నేడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుపై కన్నేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆ ప్రాజెక్టు సీమాంధ్రుల సొంతమని ఉద్ఘాటించారు. 'జలఘోష' పేరిట ఆయన ఎర్రగొండపాలెం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలులో మాట్లాడుతూ, పైవిధంగా స్పందించారు.