: బొత్స ప్రెస్ మీట్ ను అడ్డుకున్న సీమాంధ్ర విద్యార్థులు
ఢిల్లీలో దిగ్విజయ్ తో భేటీ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను సీమాంధ్ర విద్యార్ధి నాయకులు అడ్డుకున్నారు. బొత్స మాట్లాడుతున్న సమయంలో మధ్యలో అడ్డుకున్న వారు.. విజయనగరంలో విద్యార్ధులపై జరిగిన దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. అంతేగాక బొత్స క్షమాపణ చెప్పాలని నిలదీశారు. దీనిపై స్పందించిన బొత్స.. ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. వారితో తర్వాత మాట్లాడతానని, ప్రెస్ మీట్ ను అడ్డుకోవడం సరికాదని నచ్చజెప్పే ప్రయత్నంచేశారు. అయినా వినని సీమాంధ్ర విద్యార్థి సంఘాల నేతలు బయటికి వచ్చి బొత్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.