: 'నేనే ప్రవక్తను'.. పాక్ మహిళ ప్రకటన... అరెస్ట్


తానే ప్రవక్తనంటూ ప్రకటించుకున్న ముస్లిం మహిళను పాకిస్థాన్ లోని లాహోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'ముస్లింలకు ప్రవక్తను నేనే' అంటూ లాహోర్ లోని గుల్బర్గ్ కు చెందిన సల్మా ఫాతిమా కరపత్రాలను పంచుతోంది. వీటిని చూసిన స్థానికులు ఆగ్రహావేశాలతో ఫాతిమా ఇంటికి వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దైవదూషణ కింద కేసు నమోదు చేశారు. స్థానిక మహిళలు తమ బాధలను తరచుగా ఫాతిమాకు చెప్పుకుంటూ ఉంటారని, ఆమె వారికి తావీదులను ఇస్తూ ఉంటుందని స్థానికుడు ఫైసల్ అలీ తెలిపారు.

  • Loading...

More Telugu News