: విభజన అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తోంది: దిగ్విజయ్
రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. వివిధ సంఘాల వారు ఆంటోనీ కమిటీని కలుస్తున్నారన్న ఆయన, ఎవరైనా కమిటీని కలిసి వాదనలు వినిపించవచ్చునని తెలిపారు. కాగా, ఈ ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్ తో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై బొత్స వివరించారు. అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 'విభజనకు దాదాపు అన్ని పార్టీలు ఒప్పుకున్నాక వివాదం ఎక్కడున్నట్లు?' అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారా? అన్న ప్రశ్నకు తనకా విషయం తెలియదన్నారు. ఆయనపై చంద్రబాబు వ్యాఖ్యలను మీడియా దిగ్విజయ్ ను అడగ్గా.. బాబు తనకు స్నేహితుడని, అందుకే తనను లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.