: మైక్రోసాఫ్ట్ చేతికి నోకియా మొబైల్స్


సాఫ్ట్ వేర్ రారాజు మైక్రోసాఫ్ట్.. మొబైల్ తయారీ దిగ్గజం నోకియాను సొంతం చేసుకోనుంది. నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని 544 కోట్ల యూరోలు (సుమారుగా 48వేల కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేయనున్నట్లు ఈ మేరకు ప్రకటన వెలువడింది. నోకియా సీఈఓ స్టీఫెన్ ఎలోప్ మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు.

నేడు బడ్జెట్, ఫీచర్ ఫోన్ల కంటే స్మార్ట్ ఫోన్లే మార్కెట్ ను ఏలుతున్నాయి. ఈ విభాగంలో శాంసంగ్, యాపిల్ కంపెనీలు ఇస్తున్న పోటీని ఎదుర్కోవడానికి నోకియా నానా తంటాలు పడుతోంది. అదే సమయంలో విండోస్ సాఫ్ట్ వేర్ ను ఆఫర్ చేస్తున్న మైక్రోసాఫ్ట్ కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ కు పోటీనివ్వడంలో దూకుడు ప్రదర్శించలేకపోతోంది. ఈ నేపథ్యంలో నోకియా మొబైల్స్ ద్వారా మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలను దీటుగా ఎదుర్కోవచ్చన్నది మైక్రోసాఫ్ట్ వ్యూహంలా ఉంది. ఈ కొనుగోలు డీల్ వచ్చే ఏడాది జనవరి - మార్చి త్రైమాసికంలో పూర్తి కానుంది.

ప్రస్తుతం పూర్తిగా విండోస్ ఆధారిత స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది ఒక్క నోకియా మాత్రమే. ఈ డీల్ ఇరు కంపెనీల వినియోగదారులు, ఉద్యోగులు, వాటాదారులకు ప్రయోజనకరమని మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బామర్ అన్నారు.

  • Loading...

More Telugu News