: సమైక్యాంధ్రకు మద్దతుగా బెజవాడలో వైద్యులు, నర్సుల నిరసన
కృష్ణా జిల్లా విజయవాడలో ఆసుపత్రుల సిబ్బంది రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేశారు. బెంజ్ సర్కిల్ లో మానవహారం నిర్వహించి వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర అభివృద్ధి వెనక్కి మళ్లే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.