: వరంగల్ డీసీసీడీ చైర్మన్ పదవికి మళ్లీ ఎన్నిక
వరంగల్ డీసీసీబీ చైర్మన్ ఎన్నికను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. మార్చి 7న మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాంగ్రెస్ నేతలైన జంగా రాఘవరెడ్డి, దొంతి మాధవరెడ్డి మధ్య పోరు ఆఖరుకు డీసీసీబీ ఎన్నిక రద్దుకు దారితీసింది.
ఫిబ్రవరి 19న వరగంల్ డీసీసీబీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికలో జంగా రాఘవరెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడం తెలిసిందే. అదే రోజు దొంతి మాధవరెడ్డి హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకునే సరికి సమయం మించి పోయింది. ఇది సరికాదంటూ మాధవరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిల్లా ఎన్నికల అధికారి ఫలితాన్ని నిలిపివేశారు. దీనిపై జంగా రాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. రాఘవరెడ్డి, మాధవరెడ్డికి పార్టీలో పలువురి నేతల నుంచి మద్దతు ఉంది. దీంతో ఆఖరుకు 19న జరిగిన డీసీసీబీ చైర్మన్ రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. అంతేకాదు, ఎన్నికల అధికారిపై వేటు వేసి కొత్త అధికారిని కూడా నియమిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది.