: క్షీర రామలింగేశ్వరుడి సన్నిధిలో బయటపడ్డ బంగారు నాణేలు


అరుదైన బంగారు, వెండి, రాగి నాణేలు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర దేవస్థానంలో బయటపడ్డాయి. ఇవన్నీ 19వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు. మొత్తం 975 నాణేలు బయటపడగా అందులో 5 బంగారు నాణేలు, 40 వెండి, 930 రాగి నాణేలు ఉన్నాయి. ఆలయంలో ధ్వజస్తంభం గతేడాది నవంబర్ లో నేల కూలింది. దీని పునరుద్ధరణ కోసం గొయ్యి తీస్తుండగా ఈ నాణేలు బయటపడినట్లు దేవస్థానం ఈవో సూర్యచంద్రరావు తెలిపారు.

ఎక్కువ శాతం నాణేలు 1853-1873 మధ్య కాలంలో తయారైనవేనని, బంగారు నాణెం ఒక్కోటీ 22 గ్రాములు బరువు ఉందని, ఒకటి నెపోలియన్ శకానికి చెందినదిగా సూర్యచంద్రరావు వెల్లడించారు. భక్తుల కోరిక మేరకు నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు ముందు నాణేలను భూమిలో వేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News