: పెద్దోడికి పాడు బుద్ధి


వయసు 57 సంవత్సరాలు. ఉన్నది గురువు స్థానంలో. అయినా, కామంతో కంటిచూపు మసకబారింది. మనవరాలి వయసున్న 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు. పుదుచ్చేరిలో ఇది జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హరిక్రిష్ణన్ వేధింపులను బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు స్కూల్ అధికారులను కోరగా ఎలాంటి స్పందన లేదు. దీంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులతోపాటు ఇరులంచెంతాయ్, కిరుమంబక్కమ్ గ్రామాల ప్రజలు రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు కామ గురువును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. జడ్జి రిమాండ్ విధించారు. విద్యాశాఖ అధికారులు కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News