: యడ్డీ.. వెల్ కమ్: బీజేపీ


తన అభివృద్ధికి తోడ్పడిన పార్టీని కాదని వేరు కుంపటి పెట్టి దెబ్బతిన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరడానికి మార్గం సుగమం అయింది. ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ సమ్మతి తెలిపింది. బెంగళూరులో శని, ఆదివారాల్లో జరిగిన కోర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించే విషయమై సత్వరం నిర్ణయం తీసుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్ర మోడీని ఒప్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడ నేతృత్వంలో కొంతమంది నేతలు అహ్మదాబాద్ వెళ్లారు.

  • Loading...

More Telugu News