: స్పీకర్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చిన టీడీపీ
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పై టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు స్పీకర్ మీరా కుమార్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. నిన్న సభలో ఇందిరా గాంధీ మాస్క్ వేసుకుని వచ్చి నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ పై దాడికి దూసుకువచ్చి నానా దుర్భాషలాడిన సందీప్ దీక్షిత్ పై పార్లమెంటులో పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. సందీప్ దీక్షిత్ వీధి రౌడీలా ప్రవర్తించారని టీడీపీ ఎంపీలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.