: నేడు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇవాళ నిరసన దీక్షకు దిగనున్నారు. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టనున్న ఈ దీక్షలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా తాము నిరసనకు దిగుతున్నట్టు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్, మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News