: పార్లమెంట్ కమిటీ రూంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
పార్లమెంటు కమిటీ రూంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. వీరంతా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దపడుతున్నారు. లక్షాలాది మంది ప్రజలు రోడ్లపై గత నెల రోజులుగా సమ్మెలు, నిరసనలతో హోరెత్తిస్తున్నా కేంద్రం నుంచి ఏ రకమైన స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ నేతలపై సీమాంధ్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కినుక వహించిన కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి, ఆంటోనీ కమిటీకి తమ వాదనలు వినిపించేందుకు సమాలోచనలు జరుపుతున్నారు. దీంతో ఈ భేటీకి కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, పనబాక, పురంధేశ్వరి, పల్లంరాజు, ఎంపీలు లగడపాటి, అనంత, రాయపాటి, ఉండవల్లి హాజరయ్యారు.