: మొసళ్లు ఇన్ని రోజులు మాటు వేస్తాయా!


మొసళ్లు ఎన్ని రోజులు మాటువేస్తాయి... ఒకటి లేదా రెండు రోజులు మాటువేస్తాయనుకుంటాం. కానీ ఒక మొసలి ఏకంగా పదిహేను రోజులపాటు మాటువేసింది. దీంతో పాపం రేయాన్‌కు ఇంగ్లీష్‌ హారర్‌ సినిమా నిజజీవితంలో కనిపించింది. ఇంగ్లీషు హారర్‌ సినిమాల్లో చుట్టూ నీళ్లు, ఏమాత్రం ఏమరుపాటుగా నీటిలోకి దిగినా వెంటనే హరాయించేందుకు భయంకరమైన నోరు తెరచుకుని మాటువేసిన మొసలి. సరిగ్గా ఇలాగే ఒక మొసలి రాత్రి పగలు తేడా లేకుండా అలా మాటేసి ఉండడంతో పదిహేనురోజుల పాటు రేయాన్‌ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

న్యూజిలాండ్‌కు చెందిన రేయాన్‌ అనే ఒక సాహస యాత్రికుడు గత నెల వాయువ్య ఆస్ట్రేలియా తీరప్రాంతంలో కలంబురు అనే ప్రాంతానికి కాళ్లతో నడిపే చిన్న పడవ (కయక్‌)లో వెళ్లాడు. అక్కడే మారుమూల ఉన్న గవర్నర్‌ ద్వీపానికి చేరుకున్నాడు. అప్పటికే అతనివద్దనున్న ఆహారపదార్ధాల నిల్వలు తగ్గిపోవడంతో తిరిగి వెళ్దామని అనుకుని అక్కడినుండి తీర ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరం నీళ్లలో దిగుదామని అనుకోగానే ఎదురుగా భయంకరమైన ఆరు మీటర్ల పొడవైన మొసలి నోరు తెరచుకుని కరకరా నమిలేయడానికి సిద్ధంగా కనిపించింది. దీంతో వెనక్కి వెళ్లిపోయాడు. ఇలా ఒకటి రెండు రోజులు కాదు. ఏకంగా పదిహేను రోజులు ఆ మొసలి మాటువేసింది. చివరికి ఒక వ్యక్తి గవర్నర్‌ ద్వీపంలో రాత్రిపూట రేయాన్‌ వెలిగించుకున్న దీపాన్ని చూసి తీరప్రాంతంనుండి ఒక పెద్ద పడవలో వచ్చాడు. రేయాన్‌ను సురక్షితంగా తీసుకుని వెళ్లాడు.

  • Loading...

More Telugu News