: విశ్వం పుట్టుకను తెలుసుకోవచ్చు!
విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో తీవ్ర అధ్యయనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుకకు కారణంగా భావించే బిగ్‌బ్యాంగ్‌ను కృత్రిమంగా సృష్టించారు. ఈ ప్రయోగం ద్వారా విశ్వం పుట్టుకను గురించి తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో విశ్వం పుట్టుకకు కారణంగా భావించే బిగ్‌బ్యాంగ్‌ను కృత్రిమంగా సృష్టించారు. కేవలం పది మిల్లీ సెకన్లలో వారు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఒక శూన్య గదిలో అతి శీతల సీసియం పరమాణువులను ఉపయోగించి, బిగ్‌బ్యాంగ్ తరహా కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్‌ను సృష్టించగలిగారు. బిగ్‌బ్యాంగ్ సంభవించినప్పుడు విశ్వం ఎలా ఉండేదన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి తాము చేసిన ప్రయోగం ఒక అవకాశాన్ని కల్పించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.