: షుగర్‌ మందుల సేఫ్టీపై భయం వద్దు


షుగర్‌ వ్యాధికి తీసుకునే మందులు శరీర ఆరోగ్యంపై రకరకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపిస్తాయంటూ ప్రజల్లో ఒక భయం ఉంది. చక్కెర వ్యాధికి తీసుకునే మందుల వలన గుండె సంబంధిత రోగాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని, క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చునని కొన్ని అపోహలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ఈ విషయంపై సుదీర్ఘకాలపు పరిశోధనలు చేసిన బోస్టన్‌ లోని వైద్యనిపుణులు అలాంటి ఇబ్బంది ఉండదని తేల్చిచెబుతున్నారు.

బోస్టన్‌ మహిళా ఆస్పత్రిలోని వైద్యనిపుణులు రెండుసంవత్సరాలపాటు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 16,492 మంది షుగర్‌ పేషెంట్లను పరిశీలించారు. షుగర్‌కు వాడే మందుల వల్ల వారికి గుండెపోటు వచ్చే చాన్సుందేమో చూశారు. ఈ అధ్యయనంలో పాంక్రియాన్‌లో మంట పుట్టడం, కేన్సర్‌ వంటి వ్యాధులు రావడానికి ఈ మందులకు కూడా సంబంధం లేదని తేలింది. షుగర్‌కు మందులు తీసుకునేవాళ్లు ఇతర వ్యాధుల గురించి చింత లేకుండా.. ఇకపై వాటిని వాడవచ్చునన్నమాట.

  • Loading...

More Telugu News