: సింగరేణిలో మరో ఆర్నెల్లపాటు సమ్మెలపై నిషేధం
సింగరేణి కాలరీస్ లో మరో ఆర్నెల్లపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతి ఆర్నెల్లకోసారి ఈ ఉత్తర్వుల కాలపరిమితి ముగియగానే మళ్లీ ఎస్మా చట్టం అనుసరించి ఈ సంస్థలో సమ్మెలపై నిషేధం విధిస్తున్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈ నెల 11 తో ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 11 నుంచి 2014 మార్చి 11 వరకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకూడదు. దీంతో మరో ఆర్నెల్లపాటు సింగరేణిలో సమ్మెలను అత్యవసరసేవలకింద నిషేధించినట్టయింది.