: సమైక్యవాద విద్యార్థులపై బొత్స అనుచరుల దాడి
విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణను విమర్శిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాంగ్రెస్ పార్టీ నేతలు, బొత్స అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడికి నిరసనగా విద్యార్థులు మయూరి కూడలిలో రహదారులు దిగ్బంధించారు. గత కొంతకాలంగా బొత్సకు సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ శ్రేణులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో బొత్స ఇంటిని, కార్యాలయాన్ని ముట్టడించారు. భారీ సంఖ్యలో ఉన్న సమైక్యవాదులను అప్పుడేమీ చేయలేని బొత్స, విద్యార్థులపై తన ప్రతాపం చూపించారు. విద్యార్థులను ఏం చేసినా అడిగే దిక్కు ఉండదన్న ధీమాతో బొత్స అనుచరులు అందినవారినల్లా చితకబాదారు. దీంతో బాధిత విద్యార్థులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.