: హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చింది చంద్రబాబే: కళావెంకట్రావు
ప్రపంచపటంలో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది చంద్రబాబు నాయుడేనని టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగేలా చేసిన ప్రకటనను కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.