: యూరప్ లో 250 భాషలే... భారత్ లో 880 భాషలు
భాషా సంపదలో బారత్ సుసంపన్నమైనదని ఓ అధ్యయనంలో తేలింది. యూరోపియన్ దేశాల కంటే కూడా భారత్ నాలుగు రెట్లు మేటి అని నిపుణులు తేల్చారు. పీపుల్ లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా జరిపిన అధ్యయనంలో యూరోపియన్ ప్రజలు కేవలం 250 భాషల వరకే మాట్లాడగలరని తేలింది. అదే భారతీయులు దాదాపు 850 భాషలు మాట్లాడగలరని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ లో నాలుగైదు భాషలే వాడుకలో ఉన్నాయని ఇంగ్లీష్, వేల్స్ భాషలే ప్రధానంగా మనుగడలో ఉన్నట్టు వారు తెలిపారు.
విస్తీర్ణంలో ఇంగ్లండ్ లో సగభాగం ఉండే అసోంలో ఏకంగా 52 భాషలు మనుగడలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. బహుభాషలను ప్రోత్సహించేందుకు ఏర్పడిన యునెస్కో చర్చల్లో కూడా ఐదు భాషలనే ఉపయోగిస్తున్నారని తెలిపారు. అదే భారత్ లో కోర్టులు, కార్యాలయాల్లో 22 భాషలను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. తమ అధ్యయనంలో 880 భాషలను గుర్తించామని ఆ సంస్థ చైర్మన్ గణేష్ దెవీ తెలిపారు. గత యాభయ్యేళ్లలో 250 భాషలు కనుమరుగయ్యాయని ఆ సంస్థ వెల్లడించింది.