: అదే జరిగితే భావితరాలు క్షమించవని జగన్ చెప్పాడు: విజయమ్మ
తెలంగాణ వాదం ఊపందుకోవడానికి వైఎస్సారే ఆద్యుడు అని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పందించారు. తిరుపతిలో సమైక్య శంఖారావం సభలో మాట్లాడుతూ, వైఎస్ బ్రతికుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీనే ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. విభజన జరిగితే భావితరాలు క్షమించవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ చెప్పాడని తెలిపారు. తమ పార్టీ మాత్రం ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని విజయమ్మ ఉద్ఘాటించారు. విభజన నిర్ణయంపై తామే మొదట స్పందించామని చెప్పుకొచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏర్పాటు చేసిన కమిటీల వల్ల ఎలాంటి ప్రయోజనంలేదని ఆమె పెదవివిరిచారు.