: భారత వాయుసేనలోకి సీ-17 గ్లోబ్ మాస్టర్


భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చిచేరింది. యుద్ధ ట్యాంకులు వంటి భారీ ఆయుధాలను సరిహద్ధు ప్రాంతాలకు తరలించేందుకు తోడ్పడే సీ-17 అనే భారీ రవాణా విమానం భారత వాయుసేనకు జత కలిసింది. ఉత్తరప్రదేశ్ లోని హిండన్ బేస్ నుంచి ఈ విమానం ఈ రోజు (టెస్ట్ ఫ్లైట్) గగన తలానికి ఎగసింది. 80 టన్నుల బరువు మోయగల ఈ బోయింగ్ గ్లోబ్ మాస్టర్ విమానాలను భారత వాయుసేన 5.1 బిలియన్లకు ఖరీదు చేసింది. మూడింటిని యూఎస్ ఇప్పటికే సరఫరా చేయగా ఈ ఏడాది చివరికి మరో రెండు అందజేయనుంది.

  • Loading...

More Telugu News